ఏలూరు జిల్లా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ యొక్క సేవలు అభినందనీయమని ఏలూరు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ V.Prasanna Venkatesh, I.A.S తెలియజేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 15వ తారీఖున జరగనున్న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ గోడ పత్రికను బుధవారం ఏలూరు కలెక్టరేట్ ఆఫీసులో ఆవిష్కరించారు.
NCRC సేవల వలన వినియోగదారులు చైతన్యం అవుతున్నారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో NCRC జిల్లా చైర్మన్ N S V S మణికంఠ, జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరి ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ పి శ్రీనివాస్, సెక్రటరీ నిమ్మల శ్రీనివాస్ , Thulasirao.B , Gangadhrao.U తదితరులు పాల్గొన్నారు.