World Consumer Rights Day - 2024

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలకు తెలంగాణ మంత్రులకు ఆహ్వానం

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 15వ తేదీ నిర్వహించనున్న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ల ను ఆహ్వానించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ కేంద్ర కమిటీ సభ్యులు సాయి క్రాంతి శనివారం సికింద్రాబాద్ లోని వారి వారి కార్యాలయాల్లో కలసి ఆహ్వానపత్రిక అందజేశారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో పాల్గొని సందేశం వినిపించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, పొన్నం ప్రభాకర్ అంగీకరించి అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవవేడుకల్లో పాల్గొంటామని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వం నుండి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *