శ్రీకాళహస్తి: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను సేవలు అభినందనీయమని తిరుపతి కలెక్టరు డాక్టర్ లక్ష్మీశ కొనియాడారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ గోడపత్రికలను గురువారం ఆయన తిరుపతి కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరు లక్ష్మీశ మాట్లాడుతూ… వినియోగదారుల హక్కులను కాపాడటంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ముందు వరుసలో ఉంటోందన్నారు. ఈ సేవలు ఇలాగే కొనసాగించాలని ఆయన కోరుకున్నారు.
ఎన్ సీ ఆర్ సీ ప్రతినిధులు చేస్తున్న సేవలకు తమవంతు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను సభ్యులు ఎన్నో సేవలు చేస్తున్నారన్నారు. వీరి సేవల వలన వినియోగదారులు చైతన్యం అవుతున్నారని కలెక్టరు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సౌత్ ఇండియా చైర్ పర్సన్ కుసుమకుమారి, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కలవకుంట భరత్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్లు యల్లంపాటి కోటేశ్వరబాబు, వినుకొండ మాధురి, రాధిక, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ సేఫ్టీ కో-ఆర్డినేటర్ హరీష్ రెడ్డి, అబ్జర్వర్ యాగ, లీగల్ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.