దేశ రాజధాని న్యూఢిల్లీలో వచ్చే నెల 15వ తేదీ నిర్వహించనున్న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని ఆ కమిషను న్యాయమూర్తి జస్టిస్ సూర్య భాస్కరం ను ఆహ్వానించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు శనివారం విజయవాడలో జస్టిస్ సూర్యభాస్కరంను కలసి ఆహ్వానపత్రిక అందజేశారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో పాల్గొని సందేశం వినిపించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు జస్టిస్ సూర్యభాస్కరం అంగీకరించారు.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవానికి ఆహ్వానం
24
Feb